ETV Bharat / state

'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్​కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి - PUSHPA 2 STAMPEDE IN HYDERABAD

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట - మహిళ మృతి, ఆమె కుమారుడి పరిస్థితి విషమం - పలువురికి గాయాలు

Pushpa 2 Stampede
Pushpa 2 Stampede (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 6:35 AM IST

Updated : Dec 5, 2024, 7:28 AM IST

Pushpa 2 Stampede : పుష్ప-2 బెనిఫిట్​ షోను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆర్టీసీ క్రాస్​రోడ్​లోని సంధ్య థియేటర్​ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. బెనిఫిట్​ షో కోసం బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్​ రావడంతో తమ స్టార్​ హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు.

పోలీసులు చెదరగొట్టే సమయంలో తొక్కిసలాట జరగడంతో దిల్​సుఖ్​నగర్​కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్​ చేశారు. ఆ తర్వాత వెంటనే ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు. ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పుష్ప-2 బెనిఫిట్​ షోను చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు వచ్చారు. వారిలో తల్లి, కుమారుడు తొక్కిసలాటలో కిందపడి గాయాలు కాగా, తల్లి మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. అలాగే సంధ్య థియేటర్​ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హీరో కటౌట్​కు పాలాభిషేకాలు : ఇదిలా ఉండగా, పుష్ప-2 బెనిఫిట్​ షోలలో పాజిటివ్ టాక్​ రావడంతో ఉదయం నుంచే థియేటర్ల ముందు సందడి వాతావరణం నెలకొంది. కొంపల్లిలోని ఏషియన్ సినీ ప్లానెట్​లో అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకొని, ఉదయం 5 గంటల నుంచే తమ అభిమాన హీరో అల్లు అర్జున్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు.

పుష్ప-2 చిత్రం నిలిపివేయాలంటూ పిటిషన్‌ - కొట్టేసిన హైకోర్టు

బుక్‌ మై షోలో 'పుష్ప 2' హవా - సౌత్​లో మరో నయా రికార్డు సొంతం!

Last Updated : Dec 5, 2024, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.