ఖమ్మం జిల్లా రాజేశ్వరపురం ఎస్బీఐ బ్యాంకులో ఓ ఖాతాదారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు ఇవ్వటంలో బ్యాంకు ఉద్యోగులు జాప్యం చేశారని ఈ అఘాయత్నానికి ఒడిగట్టాడు. కట్టమ్మతండాకు చెందిన ఉపేందర్ 6 నెలలుగా బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరుగుతున్నా... పట్టించుకోలేదని వెంట తెచ్చుకున్న కత్తితో పొడుచుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఉపేందర్ బంధువులు బ్యాంకు ముందు ధర్నాకు దిగారు. ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు.
బ్యాంకులో కత్తిపోటు.. - knife
ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాల్లో ఆలస్యం ఓ యువకుని ప్రాణం మీదకు తీసుకొచ్చింది. ఎన్నిసార్లు కలిసినా.. పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.