ఖమ్మం జిల్లా మధిర సహకార సంఘం ద్వారా రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందిస్తున్నారు. సొసైటీ పరిధిలోని 25 గ్రామాలకు చెందిన అన్నదాతలు.. జీలుగలు, పిల్లిపెసర ధాన్యం విత్తనాలను మార్కెట్ కంటే తక్కువ ధరకే తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 3 టన్నుల విత్తనాలు సొసైటీ ద్వారా రైతులకు అందాయి. ఇంకా అవసరమైతే అదనంగా విత్తనాలు తెప్పించి సబ్సిడీకే అందిస్తామని మధిర సొసైటీ అధ్యక్షుడు బిక్కి కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఇవీ చూడండి: పుర ఎన్నికలకు 2 రోజుల్లో అధికారిక ప్రకటన...!