ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో భాజపా ఆధ్వర్యంలో సుబాబుల్, జామాయిల్ రైతులు ధర్నా నిర్వహించారు. పంటకు ఐటీసీ గిట్టుబాటు ధర కల్పించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు రూ.4500 రాకుండా సంస్థ మెటీరియల్ హెడ్ జనరల్ మేనేజర్ అమిత్ సింగ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయకుండా బ్రోకర్లను ప్రోత్సహిస్తూ.. వారికి అగ్రిమెంట్లు చేస్తున్నారని వెల్లడించారు. పంట కొనుగోళ్ల కోసం డిపోలను ఏర్పాటు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.