ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సత్యనారాయణపురంలో రూ. 2 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహ నూతన భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కస్తూర్బాగాంధీ విద్యాలయాలను ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి.. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, నాలుగు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఇక అన్ని రకాల రైల్వే సేవలకు ఒకటే నంబర్