ఖమ్మం ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ఆస్పత్రిలోని భద్రతా సిబ్బంది రోగులకు చికిత్స చేస్తున్నారంటూ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. గురువారం రాత్రి ఒక వైద్యురాలు, ముగ్గురు నర్సులపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ వేటు వేశారు.
ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తున్న వారికి ఎన్జీవో సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: నిమ్స్‌లో రెసిడెంట్ వైద్యుల ఆందోళన