Sri Vaikuntha Ekadashi Prayukta Adhyayana Utsavs: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యాయన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకో క అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో రెండో రోజైన నేడు భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో భక్తులను ఆశీర్వదించారు.
కూర్మావతారంలో ఉన్న స్వామివారికి బేడా మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం రాజభోగం మహానివేదన చేశారు. అనంతరం స్వామి వారి సకల రాజ లాంఛనాల నడుమ తిరువీధి సేవకు బయలుదేరారు.
పూర్వకాలంలో రాక్షసులు దేవతలు సముద్రంలో మందర పర్వతాన్ని చిలుకుతున్న క్రమంలో ఏ ఆధారం లేకుండా ఉన్న పర్వతం సముద్రంలో మునిగిపోగా.. శ్రీమహావిష్ణువు కూర్మావతారం తన వీపు మీద మోసారని పురాణాలు తెలుపుతున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల శని గ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా జనవరి 2 వరకు నిత్య కల్యాణం నిలిపివేశారు.
ఇవీ చదవండి: