ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి హోమం నిర్వహించారు. చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందూధర్మం గొప్పదనం, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు వివరించారు.
హిందూ మతం స్వీకరించిన పలు కుటుంబాలకు శ్రీరాముడి చిత్రపటాలు, దుస్తులు, భగవద్గీత అందజేశారు. అఖిలభారత విశ్వహిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి సత్యంజీ, తెలంగాణ ధర్మప్రచార పరిషత్ విభాగ్ చంద్రశేఖర్‌జీ, ఖమ్మం జిల్లా సభ్యులు అల్లిక అంజయ్య, యోగా గురువు ప్రేమ్ నిరంతర్, మల్లేశ్‌తో పాటు పలువురు సత్సంగాలు ఇచ్చారు.
ఇదీ చూడండి: భారీ నగదున్న బ్యాగ్ మాయం.. పోలీసుల వేట