ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని శివాలయాల్లో.. కార్తీక మాసం తొలిరోజు పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున భక్తులు పోటెత్తారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, వైరాలోని అయ్యప్ప క్షేత్రంలో శివాలయం, వైరా పాత బస్టాండ్ లోని జ్యోతిర్లింగ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే రాములు నాయక్ దంపతులు వివిధ శివాలయాల్లో పూజల్లో పాల్గొన్నారు. జూలూరుపాడులోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏన్కూరు మండలం బురద రాఘవాపురంలోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయంలో శివలింగానికి అభిషేకం చేశారు.ఏనుకూరు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీకమాస పూజలు ప్రారంభించారు.
ఇవీ చదవండి: కార్తిక శోభ: శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు