SI and Constable Events Techniques : కలల కొలువులో కీలక ఘట్టాన్ని అధిగమించే సమయం సమీపిస్తోంది. ఇన్నాళ్లూ సాగించిన కఠోర శ్రమకు ఫలితం దక్కాలంటే పోలీసు ఉద్యోగార్థులు దేహదారుఢ్య పరీక్షల్లో అప్రమత్తంగా మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ని రోజులు సాధన చేశామన్నది పక్కనబెడితే.. ఎంత మెలకువగా ఒక్కో అంశంలో అర్హత సాధిస్తూ ముందుకు సాగటమే కీలకమని చెబుతున్నారు. ఖమ్మంలో గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
- పరుగు పోటీ.. పురుషులకు.. 1,600 మీటర్లు
- మహిళలకు.. 800 మీటర్లు
టేక్ ఆఫ్ బోర్డు వద్ద లెగ్ స్టాంప్ వేయాలి: లాంగ్‌జంప్‌లో పాల్గొనే ముందు స్కిప్ జంప్స్ చేసుకోవాలి. ఏ లెగ్ అలవాటు ఉంటుందో దాన్నే టేక్ ఆఫ్ బోర్డు వద్ద స్టాంప్ వేయాలి. ఎంత గట్టిగా నొక్కితే అంత దూరంగా జంప్ చేయవచ్చు. టేక్ ఆఫ్ బోర్డును టచ్ చేయకుండా చూడాలి. భూమి, కాలికి మధ్య చర్య, ప్రతిచర్య ఏర్పడి గాలిలో ఎత్తుకు ఎగిరి దూరంగా దూకడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శరీరాన్ని గాలిలో తేలిపోయేలా ముందస్తుగానే ఫ్రీ చేసుకోవాలి. ఈక్రమంలో నిరుత్సాహం, భయానికి గురికావొద్దు. - సోములు, ఆర్‌ఐ, శిక్షకుడు
శ్వాస నియంత్రణే ప్రధానం: పరీక్షలు జరిగే మైదానంలోకి సకాలంలో అడుగుపెట్టాలి. ఈవెంట్ ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు బ్రీతింగ్ వ్యాయామం అవసరం. 1,600 మీటర్ల పరుగులో నాలుగు లాప్స్ ఉంటాయి. ట్రాక్ ఫస్ట్ ర్యాక్‌లోనే లాస్ట్ ఫించింగ్ వరకు రన్నింగ్ చేయాలి. లాస్ట్ ఫించింగ్ ఫుల్ స్పీడ్‌గా ఉండాలి. నోటితో ఉచ్ఛ్వాసనిశ్వాసల వల్ల ఎక్కువ సేపు పరుగెత్తవచ్చు. -మాలోతు నరేశ్, అంతర్జాతీయ అథ్లెట్
ట్రాక్ ఫస్ట్ ర్యాక్‌లోనే పరుగెత్తాలి: 1600 మీటర్ల పరుగు పందెంలో నాలుగు లాప్స్ ఉంటాయి. ఫస్ట్ లాప్స్‌లో మీడియం వేగంతో పరుగెత్తాలి. అప్పుడే శ్వాసపై పట్టు దొరుకుతుంది. మూడో లాప్స్ నుంచి స్ప్రిట్ తీసుకోవాలి. 200 మీటర్ల దూరం మిగిలి ఉన్నప్పుడు వేగంగా పరుగెత్తాలి. వీటిని ట్రాక్ ఫస్ట్ ర్యాక్‌లో పరిగెడుతూ చేయాలి. అప్పుడే అనుకున్న మార్కులు సాధించవచ్చు. మొదటి రెండు రౌండ్లను సాధన మాదిరిగా సాగించి మిగిలిన రౌండ్లలో వేగం పెంచుకోవడం కీలకం. - నాగేశ్వరరావు, ఆర్‌ఐ, ట్రైనర్
రింగ్‌లోంచే సత్తా చాటాలి: షాట్‌పుట్‌కి సిద్ధపడే ముందు చినప్స్, డిప్స్ సాధన చేయాలి. నిర్దేశించిన దూరానికి షాట్‌పుట్ బంతిని విసిరేటప్పుడు రింగ్‌లోంచి బయటికి రావొద్దు. పౌల్ కావొద్దనుకుంటే విసిరే దిశ, భుజ సామర్థ్యాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. విసిరే దిశలోనే బాల్‌ను డెలివరీ చేయాలి. బలంతో పాటు సమయస్ఫూర్తి ముఖ్యం. ఒకటికి, రెండుసార్లు మూమెంట్ చేసిన తరువాతే షాట్‌పుట్ డెలివరీకి సిద్ధపడాలి. -గిరిబాబు, ట్రైనర్
ఇవీ చదవండి: TSLPRB: పోలీస్ అభ్యర్థులకు అలర్ట్... అమల్లోకి కొత్త విధానం
సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ నెలలోనే ప్రారంభం!
పెళ్లి కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసిన జంట... వీడియో వైరల్