ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మూడో వార్డులో ఆదివారం ఉదయం పదిగంటల.. పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమల నివారణ యంత్రాన్ని తగిలించుకొని ఎమ్మెల్యే స్వయంగా రసాయనాలను పిచికారీ చేశారు. ప్రజలు తమ ఇళ్ళను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని.. ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ కూసంపూడి మహేష్, కమిషనర్ సుజాతలను పట్టణంలో పారిశుద్ధ్య పరిరక్షణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు చల్లగుండ్ల క్రిష్ణయ్య, కౌన్సిలర్ ప్రవీణ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!