ప్రత్యేక ఆకర్షణగా వాచ్ టవర్..
ప్రజలకు వినోదం అందించేలా పార్కును తీర్చిదిద్దారు. 8 కిలోమీటర్ల మేర సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన గేటును ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వాచ్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చిన్నారులు ఆడుకునేందకు వీలుగా అనేక రకాల ఆటలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సెల్ఫీ పాయింట్లు, పగోడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వృద్ధులు, పిల్లల కోసం బ్యాటరీతో నడిచే వాహనాలు సైతం అందుబాటులో ఉంచారు.
100 హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి..
ఉదయపు, సాయంత్రపు నడకకు వస్తున్న పట్టణవాసులతో అర్బన్ పార్కు కళకళలాడుతోంది. అర్బన్ పార్కులో చాలాచోట్ల వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు చెరువులు నిర్మించారు. పశుగ్రాసం కోసం 100 హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి పెంచుతున్నారు. స్వచ్చమైన గాలి, కాలుష్యం, వాహన రద్దీ లేని పరిసరాలతో కట్టిపడేస్తున్న సత్తుపల్లి అర్బన్ పార్కు అందాలు.. త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చూడండి: