ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాకలో వలస కూలీలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. వలస కూలీలు, పేదలకు దాతలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సహాయంతోపాటు దాతలు రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి సేవను చాటుతున్నారన్నారు.
వలస కూలీలకు రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, అధికారులు అండగా ఉన్నారని ఎలాంటి భయం లేకుండా లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు నిశ్చింతగా ఉండొచ్చని ఎమ్మెల్యే సండ్ర భరోసా ఇచ్చారు. సత్తుపల్లి నియోజకర్గంలోని అన్ని మండలాల్లో స్వచ్ఛంద సేవకులు, దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వలస కూలీలు, కార్మికులకు వితరణ చేస్తూ మానవత్వం చాటుతున్నారని కొనియాడారు.
ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది