ETV Bharat / state

నీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: సండ్ర - telangana varthalu

ఖమ్మం జిల్లాలో సాగర్​ నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతోనే ఇలా జరుగుతున్నట్లు వెల్లడించారు. పంటలు ఎండిపోకుండా కాపాడాలని కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు.

నీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: సండ్ర

author img

By

Published : Mar 19, 2021, 3:39 PM IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఖమ్మం జిల్లాలో సాగర్ నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సాగర్ ఆయకట్టు రైతులతో కలిసి కలెక్టర్ ఆర్​వీ కర్ణన్​కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సమక్షంలో ఎన్​ఎస్పీ ఎస్ఈ, ఇరిగేషన్ సీఈలతో సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు సమన్వయం చేసుకొని పంటలు ఎండిపోకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

నీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: సండ్ర

ఇదీ చదవండి: ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నాం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.