ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు పాఠశాలలను ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య సందర్శించారు. నేడు పాఠశాలల పునఃప్రారంభం కావడం వల్ల ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పాఠశాల యాజమాన్యాలను ఆదేశించారు.
అన్నారుగూడెం ఉన్నతపాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్ట్రస్థాయి అవార్డు పొందిన మాదినేని నరసింహారావును ఎమ్మెల్యే సండ్ర సత్కరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కృషి చేసినందుకు కొనియాడారు. పిల్లలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలని ఎమ్మెల్యే సండ్ర సూచించారు.
- ఇదీ చూడండి : విద్యార్థుల సందడి.. మురిసిన బడి