ETV Bharat / state

'రాజకీయ నిర్ణయం వచ్చేవరకు పోడు భూముల జోలికి వెళ్లొద్దు' - సత్తుపల్లి ఎమ్మెల్యే తాజా పర్యటనలు

అడవుల నరికివేతకు తాను అనుకూలం కాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. పోడు భూముల అంశంపై రాజకీయ నిర్ణయం వచ్చేవరకు గిరిజనుల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలోని అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో వీఎస్ఎస్ సభ్యులకురూ. 25 లక్షల చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

sathupally-mla-request-to-the-forest-officers don't-go-digging-until-the-political-decision-is-made
'రాజకీయ నిర్ణయం వచ్చేవరకు పోడు భూముల జోలికి వెళ్లొద్దు'
author img

By

Published : Jan 23, 2021, 11:16 PM IST

పోడు భూముల అంశంపై రాజకీయ నిర్ణయం వచ్చేవరకు గిరిజనుల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో వీఎస్ఎస్ సభ్యులకు రూ. 25 లక్షల చెక్కును డీఎఫ్‌ఓ సతీశ్​ కుమార్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు.

అడవుల నరికివేతకు తాను అనుకూలం కాదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఎవరూ చెట్లు నరకకుండాఎం చర్యలు తీసుకోవాలో సీఎం కేసీఆర్‌ త్వరలోనే చట్టబద్దంగా ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. 2004-2008 సంవత్సరాలలో సింగరేణి భూసేకరణలో జామాయిల్ చెట్లు కోల్పోవడంతో వాటిని విక్రయించగా వచ్చిన లాభాల్లో నుంచి 50 శాతం మంజూరైన రూ. 25 లక్షలను వీఎస్ఎస్ సమితి సభ్యులకు అందజేసినట్లు పేర్కొన్నారు.

అంతరించిపోతున్న అడవుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతోందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ మహేశ్​, కమిషనర్ సుజాత, డీఆర్వో ముత్యాలరావు, ఎఫ్ఎస్ మంగారావు, మదన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.