ETV Bharat / state

Sathupalli Constituency Fully Dalit Bandhu Scheme : సత్తుపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో దళితబంధు.. ఉత్తర్వులు జారీ - KTR Khammam district tour

Sathupalli Constituency Fully Dalit Bandhu Scheme : ఎన్టీఆర్ శిష్యుడిగా సీఎం కేసీఆర్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకే వ్యారెంటీ లేదని.. ఆ పార్టీ నాయకుల మాటలకు గ్యారెంటీ ఎక్కడుంటుందని కేటీఆర్ ప్రశ్నించారు.

Dalit Bandhu Scheme
KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 10:56 PM IST

Sathupalli Constituency Fully Dalit Bandhu Scheme Implementation : ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా.. ఖమ్మం, స్తతుపల్లి నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మంలో రూ.1390 కోట్లు, సత్తుపల్లిలో రూ.142 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండుచోట్లా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మూడు కమాండ్​లు ఉన్నాయని చెప్పారు.

హైదరాబాద్​లో లోకల్​ కమాండ్.. బెంగళూరులో న్యూకమాండ్.. దిల్లీలో హైకమాండ్ అని కేటీఆర్ (KTR) విమర్శించారు. ఒకరి మాట ఒకరు వినరని.. ఒకరు ఇచ్చిన హామీకి ఇంకొకరికి నెరవేర్చరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కప్పల తక్కెడ లాంటిందని.. ఒకరు పైకివస్తుంటే నలుగురు కిందికి లాగుతారని అన్నారు. హస్తం పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని 11 సార్లు పాలించిందని గుర్తు చేశారు. ఆరు దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ.. వారు చేసిన మోసాలు, దగా ప్రజలు మరిచిపోలేదని కేటీఆర్ వివరించారు.

KTR Speech in Wanaparthy Ten Years Progress : 'తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష?'

KTR on Congress Six Guarantees : ఆరు దశాబ్దాలపాటు ఏమీ చేయని అసమర్థులు.. ఇప్పుడు 6 గ్యారెంటీలంటూ కొత్త వేషాలతో ప్రజల ముందుకొస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఈ హామీలు అమలు చేస్తున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీలని ఊదరగొడుతున్న హస్తం నాయకులకు.. అసలు వాళ్ల సీట్లకే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రశ్నించారని.. కేటీఆర్ పేర్కొన్నారు

ఇచ్చినట్లు చూపిస్తే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎంపీ ప్రకటించారని కేటీఆర్ అన్నారు. ఆయనకు అనుమానం ఉంటే.. ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గానికైనా రావాలని.. సమయం, తేదీ చెప్పి జిల్లాలో ఏ మండలం, ఏ గ్రామం వస్తారో చెప్పాలని తెలిపారు. బీఆర్ఎస్​ నాయకులు కూడా అక్కడికి వస్తారని.. అక్కడ కరెంట్ తీగలు పట్టుకుంటే.. విద్యుత్​ సరఫరా ఉందో లేదో తెలుస్తుందని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ నుంచి.. తెలంగాణ హస్తం పార్టీకి వందల కోట్లు వస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Minister KTR Fires on Governor Tamilisai : 'గవర్నర్‌ మనసుతో ఆలోచించి ఉంటే.. తిరస్కరించేవారు కాదు'

KTR Fires on Congress : కర్ణాటకలో కొత్త భవనాలు నిర్మిస్తే ప్రత్యేకంగా చదరపు గజానికి రూ.500 ముక్కు పిండి వసూలు చేసిన సొమ్మును.. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ రాష్ట్రం నుంచి వందల కోట్లు తెచ్చి.. ఇక్కడి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వందల కోట్లు ఖర్చు చేసినా అమ్ముడు పోయే అంగడిసరుకు తెలంగాణ కాదని తెలిసే విధంగా.. బెంగళూరు, దిల్లీ వాళ్లకు ప్రజలు సమాధానం చెప్పాలని అన్నారు. హస్తం పార్టీ దొంగ సొమ్ము తీసుకుని.. ప్రజలు బీఆర్ఎస్​కు ఓటు వేయాలని సూచించారు. ప్రగతి రథ చక్రాలు మందుకు వెళ్లాలంటే భారత్​ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కేటీఆర్ కోరారు.

KTR Khammam District Tour : ఖమ్మం లకారం ట్యాంక్​బండ్ సమీపంలో ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్​ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నందమూరి తారక రామారావు ఆరాధ్య దైవమని కొనియాడారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కేటీఆర్ వెల్లడించారు.

KTR About NTR in Khammam Tour : చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికి చిరస్మరణీయంగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ (NTR) స్థాయికి ఆయన చేపట్టిన సీఎం పదవి చాలా చిన్నదన్నారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తెలుగుజాతి ఖ్యాతిని నందమూరి తారక రామారావు చాటిచెప్పితే.. ఆయన శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పారని వివరించారు. ఎన్టీఆర్ సాధించలేనిది ఆయన శిష్యుడిగా కేసీఆర్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సీయం కొట్టడం ఖాయమని కేటీఆర్ తెలిపారు.

KTR Reaction on TDP Protest in Telangana : ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలోనే తేల్చుకోవాలి: కేటీఆర్‌

KTR Comments on Tummala and Ponguleti : సత్తుపల్లి ప్రగతి నివేదన బహిరంగ సభలో ఇటీవల బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై.. కేటీఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇద్దరు నేతల పేర్లు ప్రస్తావించకుండానే విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకుల స్వీయ బాధ.. ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్​కు టికెట్ దక్కకపోయినా.. పార్టీ కోసం, కేసీఆర్ గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు.

కానీ ఓ ఇద్దరు నాయకులు మాత్రం టికెట్లు రాలేదని.. కేసీఆర్​పై విమర్శలు చేసి పార్టీ మారారని కేటీఆర్ మండిపడ్డారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న నాయకుడిని మంత్రిని చేశామని గుర్తు చేశారు. నిన్నటి వరకు దేవుడైన ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాత్రం వారికి దయ్యం అయ్యారని కేటీఆర్​ పేర్కొన్నారు.

KTR Laid foundation Stones of Many Bridges : 'హైదరాబాద్​లో తొమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందే ఉంది'

Sathupalli Constituency Fully Dalit Bandhu Scheme : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సత్తుపల్లి నియోజకవర్గానికి దళితబంధు (Dalit Bandhu) ప్రకటిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి.. దళిత బంధు పథకం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హుజురాబాద్ తరహాలోనే.. వెంటనే సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం అధికారులు రంగంలోకి దిగుతారని తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా వెంటనే ప్రత్యేక అధికారుల్ని నియమించి.. దళిత కుటుంబాల వివరాలు సేకరిస్తామని చెప్పారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి.. దళితబంధు అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది.

KTR on Telangana Congress Six Guarantees : 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్ అయింది'

KTR Playing Football Video Viral : పుట్​బాల్​ ఆడుతూ గోల్​ కొట్టిన కేటీఆర్​.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.