ETV Bharat / state

'నిస్వార్థంగా పనిచేయాలి... సమాజ సేవలో ముందుండాలి' - తెలంగాణ వార్తలు

వార్షిక తనిఖీల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్​ను సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్ పరిశీలించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిస్వార్ధంగా, అంకితభావంతో పని చేయలని సూచించారు. చక్కటి ప్రతిభ చూపిన పోలీసులను అభినందించారు.

sathupalli acp venkatesh visit enkuru police station
సమాజసేవలో పోలీసులు గుర్తింపు పొందాలి: ఏసీపీ
author img

By

Published : Dec 29, 2020, 9:21 PM IST

విధుల పట్ల అంకితభావంతో పని చేస్తూ సమాజసేవలో పోలీసులు గుర్తింపు పొందాలని సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్​ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్​ను పరిశీలించారు. ఏడాదిలో నమోదైన, పరిష్కారమైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. నిస్వార్ధంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు.

శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఏసీపీ సూచించారు. ఇటీవల కాలంలో ఏన్కూర్ ఎస్ఐ శ్రీకాంత్ ఛేదించిన రాష్ట్రస్థాయి కేసుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నకిలీ పురుగు మందులు, విత్తనాలను అరికట్టడంలో చక్కటి ప్రతిభ చూపిన పోలీసులను అభినందించారు. నూతన సంవత్సర వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. ఏసీపీతో పాటు సీఐ కరుణాకర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నాఫ్ స్కాబ్ ఛైర్మన్​గా కొండూరు రవీందర్ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.