ETV Bharat / state

కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తోన్న సర్పంచ్​ - కరోనా కట్టిడికి బరిలో దిగిన సర్పంచ్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఓ సర్పంచ్. గ్రామంలో ప్రజలకు శుభ్రంగా ఉండాలంటూ సూచిస్తూ.. పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నాడు.

Sarpanch is trying to protect their village people
కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తోన్న సర్పంచ్​
author img

By

Published : Mar 24, 2020, 11:00 PM IST

గ్రామ బాగుకోసం, ప్రజల ఆరోగ్యం కోసం అధికారాన్ని.. పదవిని పక్కనబెట్టాడు ఓ సర్పంచ్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో తానే స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తాడు. ఖమ్మం జిల్లా బోనకల్ సర్పంచ్ సైదా నాయక్ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోని అన్ని వీధులు తిరుగుతూ.. పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు.

స్వయంగా స్ప్రేయర్ భుజానికి వేసుకుని ఊరంతా డెటాల్​తో స్ప్రే చేశారు. గ్రామంలోని రహదారుల పక్కన ఉన్న మురుగుకాల్వల వెంబడి బ్లీచింగ్ పిచికారీ చేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు సూచనలు చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎలాంటి సేవ చేసేందుకునైనా.. వెనకాడబోనని సర్పంచ్ సైదా నాయక్ స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తోన్న సర్పంచ్​

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.