ETV Bharat / state

యథేచ్చగా తోడేస్తున్నారు... పట్టించుకునే నాథుడే లేడు.. - telangana varthalu

ఖమ్మం జిల్లా తల్లాడలో కిష్టాపురంలో భారీగా ఇసుక నిల్వ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కట్టలేరు వాగులో 500 ట్రక్కుల ఇసుకను గుట్టగా పోస్తున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం, స్థానిక అధికారులు పట్టించుకోకుండా ఖమ్మం టాస్క్‌ఫోర్స్​ అధికారులు సీజ్‌ చేయడం ఆరోపణలకు తావిస్తున్నాయి. తొలుత ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

యథేచ్చగా తోడేస్తున్నారు... పట్టించుకునే నాథుడే లేడు..

author img

By

Published : Feb 21, 2021, 7:56 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం పంచాయతీ కిష్టాపురంలోని కట్టలేరు వాగులో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, వాటిని నివారించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మించే గుత్తేదారు ఏకంగా 500 ట్రక్కుల ఇసుకను డంప్‌ చేయడం వెనక మతలబు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడం వారి తీరుకు, పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది.

పట్టించుకోని స్థానిక అధికారులు
కిష్టాపురంలోని కట్టలేరు వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి రూ. 5.42కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణ పనులకు ఇటీవల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం పనులను నిర్వహించాల్సిన గుత్తేదారు ఆ వాగులోనే ఇసుకను తవ్వి కట్టపై 500 ట్రక్కుల ఇసుక డంప్‌ చేశాడు. నాణ్యత లేని ఆ ఇసుకను చెక్‌డ్యాంకు వాడుతారనే ఉద్దేశంతో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వచ్చి ఆ ఇసుకను స్వాధీనం చేసుకునే వరకు స్థానిక అధికారులు నోరెత్తకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
డంప్​ చేస్తున్నా పట్టించుకోవట్లేదు..

గృహ అవసరాల కోసం ఎవరైనా వాగులో ఇసుక కోసం వెళితే వెంటనే హడావుడి చేసే మండల అధికారులు ఓ గుత్తేదారు ఇంత భారీ ఇసుక డంప్‌చేసినా కిమ్మనకపోవడం విమర్శలకు తావిస్తోంది. యంత్రాలు, ట్రాక్టర్లతో కట్టలేరు వాగులోని ఇసుకను డంప్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈ పరిస్థితిపై తల్లాడ తహసీల్దార్‌ జి.శ్రీలతను వివరణ కోరగా టాస్క్‌ఫోర్స్‌, తల్లాడ పోలీసులు దాడులుచేసి ఇసుకను పట్టుకున్నారన్నారు. సమాచారాన్ని కల్లూరు ఆర్డీవో, మైనింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.

ఇదీ చదవండి: విధివంచితుల విషాదగాథ.. ఎన్నెళ్లైనా తీరని వ్యథ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.