ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన - సంఘీభావ ర్యాలీ
ఖమ్మంలో 22వ రోజు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు సంఘాలు సంఘీభావ ర్యాలీలు చేపట్టారు. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన
ఆర్టీసీ సమ్మె 22వ రోజున ఖమ్మంలో మద్దతుగా పలు సంఘాలు సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు, పలు రాజకీయ పక్షాలు డిపో ఎదుట ధర్నా చేపట్టాయి. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆటలు ఆడారు. ధర్నా నిర్వహించినంత సేపు బస్టాండ్‌లో బస్సులను నిలిపి వేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
sample description