ఖమ్మం రీజియన్‌లోని ఆరు ఆర్టీసీ డిపోల్లో గతంలో నెలకు రూ.6 కోట్ల వరకు డీజిల్‌కు వ్యయమయ్యేది. మూడు వారాలుగా పెట్రో ధరల పెరుగుదలతో రూ.కోటి వరకు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కష్టకాలంలో రెండు నెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆదాయం రాలేదు. అయినప్పటికీ ఉద్యోగులకు వేతనాలు ఆపలేదు.
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు మినహా మిగిలిన బస్సులు రోడ్డెక్కినా కరోనా నిబంధనలు ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టాయి. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ శానిటైజర్ ఇవ్వడం, భౌతికదూరం పాటించడం, సీట్ల సంఖ్యకు మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వీలు లేకపోవడం, ఇతర ప్రాంతాలకు రాకపోకలు తగ్గిపోవటం ఆదాయం తగ్గడానికి కారణాలయ్యాయి.
జూన్ 1న కంటే 19న బస్సులు ఒకే దూరం ప్రయాణించినా పెరిగిన ఇంధన వ్యయంతో రోజుకు రూ.3.64లక్షలు అదనంగా భారం పడింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే నెలకు సుమారుగా రూ.కోటికి పైగా భారం పడుతున్నట్లు అర్థం అవుతుంది.
ఇవీ చూడండి: వైద్యులు నిజమైన హీరోలు: బండారు దత్తాత్రేయ