ETV Bharat / state

'ప్రజా'రవాణాతో కాస్త ఊరట

లాక్​డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఉదయం 6 గంటలకే వివిధ రూట్లకు బస్సులు బయల్దేరాయి.

author img

By

Published : May 19, 2020, 7:20 PM IST

Khammam district latest news
Khammam district latest news

ఖమ్మం జిల్లాలోని వివిధ బస్ స్టేషన్ నుంచి బస్సుల పున:ప్రారంభం కావడం వల్ల ప్రయాణికులు కాస్త ఊరట చెందారు. ప్రధానంగా హైదరాబాద్​,వరంగల్ , మహబూబాబాద్,భద్రాచలం, కొత్తగూడెంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లాక్​డౌన్ నాటినుంచి ఇబ్బందులు పడుతున్నారు.

ప్రైవేటు వాహనాలలో ప్రయాణం క్లిష్టంగా మారడం వల్ల బస్సుల రాకతో జిల్లాలోని వివిధ బస్టాండ్​లకు ప్రయాణికుల తాకిడి మొదలైంది. లాక్​డౌన్​ నిబంధనలు ప్రకారం డిపోల్లోనే బస్సులను శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్​ అందజేస్తున్నారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు. ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపలేదు. బస్సులు తిరిగి సాయంత్రం 7 గంటల వరకు డిపోల్లోకి చేరే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.