పిల్లల పెంపకంలో మార్పు రానంత వరకు దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగవని వక్తలు అభిప్రాయపడ్డారు. ఖమ్మం కెమిస్ట్ డ్రగ్గిస్ట్ భవనంలో తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో 'మహిళలపై అత్యాచారాలు- నివారణ మార్గాలు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వామపక్ష సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు, పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి అని ఆ దిశగా పాఠ్యాంశాలు చేర్చాలని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇదీచూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!