Record price for Red chilli : తెలంగాణలో గతకొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారు. కొద్దిరోజుల్లో చేతికందుతుందనుకున్న సమయంలో పంటలు నీటిపాలయ్యాయి. పంట నష్టపోయిన రైతులు లబోదిబోమని విలపిస్తున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి పంటకు రికార్డు ధర పలకింది. ఇది రైతు కళ్లలో ఆనందాన్ని నింపిందని, మంచి ధర రావడం తనకెంతో సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
Record price for Red chilli in Khammam Market : ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చికి రికార్డు ధర పలకడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆయన జెండా పాట నిర్వహించారు. ఉదయమే మార్కెట్కు వచ్చిన ఆయన జెండా పాట పాల్గొన్నారు. అత్యధిక ధర నిర్ణయించాలని వ్యాపారులకు సూచించడంతో వారు తేజ రకం మిర్చి పంటకు క్వింటాలుకు రూ.25,550 రూపాయలు చెల్లించారు. దీంతో జెండా పాట ధర రూ.25,550గా నిర్ణయించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రైతులకు వెన్ను దన్నుగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం మార్కెట్లో వ్యాపారులు, కమీషన్‌దారులు, రైతులు కలిసికట్టుగా ఎవరు నష్టపోకుండా చూసుకోవాలని సూచించారు. గత కొద్ది రోజులుగా ఖమ్మం మార్కెట్లో అన్ని పంటలకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని వెల్లడించారు. అయితే మార్కెట్లో కి వచ్చిన సరుకు అంతా జెండా పాటకు అటు ఇటుగా కొనాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రైతుకు మంత్రి సన్మానం చేసి మిఠాయిలు తినిపించారు.
వర్షపు నీరు..రైతుల కంట కన్నీరు.. రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికచ్చిన పంట నేలపాలైందని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడి అంతా పెట్టి తీరా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పడి అప్పుల పాలు చేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక అకాల వర్షాలు నిండా ముంచాయని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతుల్లో భరోసా నింపారు . పంట నష్టం నమోదును వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు తొెందరలోనే పరిహారం అందేలా చేస్తానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పంట సర్వం నష్టపోయి.. అన్నదాతలు దిక్కుతోచని పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తుందనుకున్న దశలో మొక్కజొన్న ఎందుకూ పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: