ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెబల్స్‌ టెన్షన్‌ - పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల పాట్లు - Tensionrebel candidates parties Khammam district

Rebel Candidates Tension in Joint Khammam District : నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్న వేళ.. ఎన్నికల బరి నుంచి రెబల్స్‌ను తప్పించేందుకు ప్రధాన రాజకీయపార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఓ వైపు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తూనే.. రెబల్స్‌ తలనొప్పి లేకుండా పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 8:18 AM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన పార్టీలకు రెబల్స్‌ తలనొప్పి

Rebel Candidates Tension in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (Joint Khammam District) పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు.. ఎన్నికల బరిలో నిలిచారు. తమకు టికెట్ దక్కకపోవడంతో భగ్గుమన్న అసమ్మతులు ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటూ సొంత పార్టీకి సవాల్ విసిరి నామపత్రాలు దాఖలు చేశారు. ఉభయ జిల్లాల్లోని అధికార భారత్ రాష్ట్ర సమితితోపాటు కాంగ్రెస్‌కు రెబల్స్‌ బెడద తప్పలేదు.

Khammam Political News Latest : మధిర, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు (Rebel Candidates in Telangana Assembly Elections) బరిలో నిలవగా.. పాలేరు, వైరా, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు రెబల్స్‌ తలనొప్పులు ఉన్నాయి. పార్టీ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నేతలు.. పార్టీల నుంచి తిరుగుబాటుదారులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటి వరకు తుది గడువు ఉంది. దీంతో ఏ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి రెబల్స్‌ పోటీలో ఉన్నారో వారిని తప్పించేందుకు ఆయా పార్టీలు, అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. బరిలో ఉన్న తిరుగుబాటుదారుల నామినేషన్లు ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తున్నారు.

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు

Dissent Leaders Issue in Political Parties : పాలేరులో కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న రామసహాయం మాధవి రెడ్డిని.. జిల్లా పార్టీ నాయకులు బుజ్జగించినా ఫలితం లేకపోయింది. దీంతో హస్తం పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఆమె బరిలో ఉంటానని చెబుతున్నారు. వైరాలో కాంగ్రెస్‌ టికెట్ ఆశించి భంగపడ్డ రామ్మూర్తి నాయక్‌ను.. జిల్లా నేతలు బుజ్జగించినా వెనక్తి తగ్గలేదు. దీంతో.. సొంత నియోజకవర్గంలో తిరుగుబాటుదారు లేకుండా చేసేందుకు స్వయంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) ఆయనతో మాట్లాడుతున్నారు. పార్టీ పరంగా న్యాయం చేస్తామన్న హామీ ఇవ్వాలని రామ్మూర్తి నాయక్ డిమాండ్ చేస్తున్నారు.

వైరాలో బీఆర్ఎస్‌ రెబల్‌గా బరిలో ఉన్న గిరిబాబు నామినేషన్ ఉపసంహరించుకునేలా.. గులాబీ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. మధిరలో భారత రాష్ట్ర సమితి రెబల్‌గా బరిలోకి దిగిన బొమ్మెర రామ్మూర్తి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో పోటీలో ఉంటానని తెగేసి చెబుతున్నారు. ఇల్లందు కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి. చీమల వెంకటేశ్వర్లు, బానోత్ స్రవంతి, మంగీలాల్ నాయక్, మోహన్ జీ, నామోదర్ నాయక్ బరిలో ఉండటంతో నామినేషన్లు ఉపసంహరించుకునేలా నాయకులు పావులు కదుపుతున్నారు.

Political Heat in Khammam District : రసవత్తరంగా ఖమ్మం రాజకీయం.. నువ్వానేనా అంటూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఢీ

వీరిని బుజ్జగించేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినప్పటికీ వెనక్కి తగ్గకపోవడం వల్ల.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వీరిని నామినేషన్లు ఉపసంహరించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పినపాకలో హస్తం పార్టీ తిరుగుబాటుదారుడు భట్టా విజయ్‌ గాంధీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : సొంత పార్టీలో రెబల్స్‌ను తప్పించుకుంటూనే.. పక్క పార్టీల్లో అసమ్మతి నేతలను తమవైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా తిరుగుబాటు బావుటా ఎగిరేసిన నాయకులకు పదవుల ఆశ, ఆర్థిక భరోసా కల్పిస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అసంతృప్త నేతలపై ప్రత్యేక దృష్టి సారించిన బీఆర్ఎస్‌... వారిని గులాబీ దళంలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు

Consultation Rebel Candidates in Telangana Assembly Elections : ఇప్పటికే కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేతలను.. బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అశ్వారావుపేట కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన సున్నం నాగమణి ఇటీవలే.. గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నేడు ఆమె నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. ఇల్లందు హస్తం పార్టీ రెబల్‌గా నామినేషన్ వేసిన ప్రవీణ్‌ నాయక్‌ను.. భారత రాష్ట్ర సమితి తనవైపు తిప్పుకుంది. మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) సమక్షంలో ప్రవీణ్‌ నాయక్ గులాబీ కండువా కప్పుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్‌ ఇంకా పట్టువీడక పోతుండటంతో ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఖమ్మంలో దొంగ ఓట్ల వ్యవహారం - తుమ్మల, పువ్వాడ మధ్య మాటల తూటాలు

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.