ఖమ్మం జిల్లా వైరాలో యువ భారత్ శక్తి ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే నడక నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సైనికులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు జోహార్లు పలుకుతూ.. పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
భారత్ మాతాకీ జై.. జై జవాన్-జై కిసాన్ నినాదాలతో దేశభక్తిని చాటుతూ.. ర్యాలీ కొనసాగించారు.
ఇదీ చూడండి : మంత్రి గారి చేతి కడియం కొట్టాశారు!