దేశంలో భూమిని సాగు చేసే వారిని దేశద్రోహులుగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఎవరి పక్షం వహిస్తోందో అర్థమవుతోందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 15న ఖమ్మంలో రైతుగర్జన పేరుతో భారీ ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సభను విజయవంతం చేయాలని కోరారు.
అంతకు ముందుగా ఈ నెల 7 నుంచి 12 వరకు ప్రచార జాతాలు చేపడతామని రంగారావు ఆన్నారు. అలాగే అఖిల భారత కార్యక్రమాలను జయప్రదం చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'నిజాయితీకి నియంతృత్వానికి మధ్య జరిగే ఎన్నికలివి'