ETV Bharat / state

వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంతక సేకరణ కార్యక్రమం - protest against central formers acts by congrss at enkoor

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా ఏన్కూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రైతుల సంతక సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు.

protest against central formers acts by congress in khammam district
వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంతక సేకరణ కార్యక్రమం
author img

By

Published : Oct 2, 2020, 5:40 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రధాన కూడళ్లలో చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల సంతక సేకరణ కార్యక్రమం నిర్వహించారు. చట్టాలు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని.. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ మాజీ కార్యదర్శి వేముల కృష్ణ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, ఉప్పెర్ల ఆనందప్రసాద్, ఎంపీటీసీ లచ్చిరాం నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'దేశం లౌకిక వ్యవస్థకు రక్షణ కరవు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.