Prajapalana Program in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో ప్రజాపాలన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అర్హులైన వారి నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులకు ప్రక్రియ ఊరూరా సందడిగా సాగుతోంది. ఎక్కడ చూసినా గ్రామసభల్లో జనం కిటకిటలాడుతున్నారు. అధికార యంత్రాంగం, సిబ్బంది గ్రామాల్లో తిష్టవేసి మరీ అర్జీలు స్వీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు హాజరై ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే దరఖాస్తుల ప్రక్రియపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో చాలాచోట్ల ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రజాపాలన సదస్సుల పొడిగింపు ఉండదు : మంత్రి పొన్నం
Prajapalana Applications In Khammam : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజాపాలనలో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాలకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు అనూహ్య స్పందన వస్తోంది. రెండు జిల్లాల్లోని 1070 పంచాయతీలు, ఏడు పురపాలికలు, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తులు చేపట్టారు. ముందుగానే ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్ల వారీగా ఆ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గ్రామ సభలకి ఆశావహులు పోటెత్తుతున్నారు.
Prajapalana Program in Telangana 2024 : ఎక్కడ చూసిన భారీ వరుసలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీలు సహా ఇతర పథకాల్లో లబ్ధి కోసం భారీగా ఆశావహులు అర్జీలు పెట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం లక్షా 61 వేల 286 దరఖాస్తులు అందగా ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకాలకి లక్షా 54వేల 840 వచ్చినట్లు వివరించారు. మరో 6వేల 446 అర్జీలు ఇతర పథకాల కోసం అందినట్లు అధికారులు చెప్పారు.
అన్నిచోట్ల దరఖాస్తులు నింపేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేసిన అధికారులు నిరక్షరాస్యుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రైతుభరోసా, పింఛన్లు అందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని అధికారులు తెలిపారు. అర్జీల్లో అధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వస్తున్నట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి మళ్లీ 'ప్రజాపాలన'
" ప్రభుత్వంపై కోటిఆశలతో దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తాం. అప్లికేషన్లకు సమయం సరిపోక పోతే గడువు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ప్రజలు అన్ని పధకాలకు దూరమయ్యారు. అర్జీల్లో అధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వస్తున్నాయి. అన్ని అప్లికేషన్లను గమనించి ఒక వ్యూహాత్మకంగా నిబద్దతతో ఉన్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పధకాలు అందిస్తాము. 5సంవత్సరాలలో ఇళ్లులేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తాము. -పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి
ఉమ్మడిజిల్లాలో ప్రభుత్వంపై కోటిఆశలతో దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ న్యాయంచేస్తామని..ఈ నెల 6 వరకు గడువు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. సమయం సరిపోక పోతే గడువు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొంగులేటి స్పష్టంచేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి మరో 3 రోజుల సమయం మిగిలి ఉండటంతో పెద్దసంఖ్యలో అర్జీలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆరు గార్యెంటీ పథకాల్లో దళారులకు చోటు లేదు - ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ - క్యూ కట్టిన ప్రజానికం