ఖమ్మం జిల్లాలో పలు గ్రామాల్లోని రైతులు వరుణుని కటాక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఏన్కూరులో బొడ్రాయి, ముత్యాలమ్మ వృక్ష దేవతలకు జలాభిషేకం చేశారు. వానలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఖరీఫ్ ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా వాన దేవుని కరుణించకపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి... ప్రజలంతా పాడి పంటలతో వర్థిల్లాలని గ్రామదేవతలకు మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఇదీ చదవండిః యువతి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం