రైతు చట్టాలను వ్యతిరేకించే నైతిక హక్కు కేసీఆర్కు లేదని మాజీ ఎమ్మెల్సీ, భాజపా తమిళనాడు ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి... ముఖ్యమంత్రి మోసం చేశారని వ్యాఖ్యానించారు. వరి సన్నాలు వేసుకోమని చెప్పి గిట్టుబాటు ధర కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.
ఖమ్మం నగరంలో చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. నగరంలో తెరాస నాయకులు, కార్పొరేటర్లు సాగించిన భూదందాలు, ఆక్రమణలపై ఛార్జీ షీట్ విడుదల చేస్తున్నామని చెప్పారు. తెరాస నాయకుల బండారం బయట పెడతామని హెచ్చరించారు. నగరపాలక సంస్థపై భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు.