Ponguleti SrinivasReddy Fires on BRS : రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హస్తం పార్టీలో చేరారు. పొంగులేటికి కండువా కప్పి రాహుల్ పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా భావి భారత దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వారం రోజులుగా బీఆర్ఎస్ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆయన తెలిపారు.
Ponguleti Joins in Congress : తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా తెలంగాణ బిడ్డలు పోరాటం చేశారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్నో పోరాటాలు చేసినా.. ఎవరూ తెలంగాణ ఇవ్వలేదని వివరించారు. తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు సోనియా తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే.. ఏపీలో కాంగ్రెస్ చనిపోతుందని సోనియాకు తెలుసని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అయినా యువకుల బలిదానం జరగవద్దని రాష్ట్రం ఇచ్చారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.
Ponguleti SrinivasReddy Comments on KCR : మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రైతు రుణాలు మాఫీ చేస్తానన్న హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 8,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
khammam Congress Meeting : లక్షలాది తెలంగాణ బిడ్డల కోరిక మేరకు హస్తం పార్టీలో చేరానని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. రాహుల్, ఖర్గే, ప్రియాంకను కలిశాక కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రమే బీఆర్ఎస్ను ఇంటికి పంపగలదని వ్యాఖ్యానించారు. భారత్ రాష్ట సమితిని బంగాళాఖాతంలో కలపాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణతో పాటు దేశంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలి. రాహుల్‌ను ప్రధాని చేసేందుకు అందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలి. కేసీఆర్‌ను ఇంటికి సాగనంపేందుకు అందరూ కృషిచేయాలి. - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత
Congress Janagarjana Sabha in Khammam : అంతకుముందు ఖమ్మం జనగర్జన సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ.. తొలుత ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రుద్రరాజు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకున్న ఆయనకు తెలంగాణ నేతలు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద రాహుల్‌ను చూసేందుకు కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఓపెన్ టాప్ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. ఇందులో భాగంగానే రాహుల్‌ను.. గద్దర్ ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సీతక్కను రాహుల్ భుజం తట్టి అభినందించారు. భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి: Ponguleti Emotional పొంగులేటి ఎమోషనల్ సభను అడ్డుకునేందుకు BRS కుట్రలు
Manik Rao Thakre Chit Chat : 'బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు.. ఖమ్మం సభ తర్వాత చేరికలు'