ETV Bharat / state

Ponguleti tour: 'చీమలపాడు ఘటన.. బాధ్యులైన నేతలపై కేసులు పెట్టాలి' - Ponguleti Srinivas Reddy latest news

Ponguleti Visited cheemalapadu Fire Accident Victims: చీమలపాడు బాధిత కుటుంబాలను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన నేతలపై కేసు నమోదు చేయాలన్నారు. ఇది ముమ్మాటికి బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన హత్యలేనని ఆయన విమర్శించారు.

Ponguleti
Ponguleti
author img

By

Published : Apr 14, 2023, 8:40 PM IST

Ponguleti Visited cheemalapadu Fire Accident Victims: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ ఘటనకు సంబంధించి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులను నిందితులుగా చేస్తూ కేసు నమోదు చేయాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు.

ఇది ముమ్మాటికి బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన హత్యలేనని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఇది అధికారిక కార్యక్రమం కాదని.. ఏదో మొక్కుబడిగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారని విమర్శించారు. మరణించిన వారికి రూ.50 లక్షలు.. గాయపడిన బాధితులకు రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఎర్రపాలెం మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నేటి వరకు చెల్లించలేదని శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు.

తాను రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం లేదని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధం లేదని చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుందని విమర్శించారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని.. జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని కోరారు. ఈ కేసును పోలీసులు సరిగ్గా విచారించడం లేదన్నారు. నిందితులను శిక్షించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అసలేం జరిగిందంటే: చీమలపాడులో రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య నేతలు వస్తుండగా.. కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలోనే సమీపంలోని గుడిసెపై నిప్పు రవ్వలుపడి మంటలు వ్యాపించాయి. ఇందులో భాగంగానే మంటల తాకిడికి గుడిసెలో ఉన్న సిలిండర్‌.. ఒక్కసారిగా పేలింది. దీంతో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీస్ వాహనాల్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఒకరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించే క్రమంలో మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు.. క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులందరికీ పూర్తిగా ఉచితంగా వైద్యం అదిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే మరోవైపు ఈ ఘటనకు బాధ్యులైన బీఆర్​ఎస్ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్​ఎస్ స్వార్థ రాజకీయాలకు పేదలు బలయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: బాణాసంచా పేల్చిన BRS కార్యకర్తలు.. కారేపల్లిలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

చీమలపాడు ఘటన దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అధికార విపక్ష నేతలు

Bandi Sanjay: 'అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్‌కు లేదు'

ఇల్లు మారిన రాహుల్.. సోనియా ఇంటికి సామాన్లు.. 20 ఏళ్ల తీపి గుర్తులు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.