ETV Bharat / state

Political Heat in Paleru Constituency : రసవత్తరంగా పాలేరు పోరు.. ముఖ్య నేతల పోటీతో మారిన రాజకీయ సమీకరణాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 10:30 PM IST

Political Heat in Paleru Constituency : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలందరూ పాలేరు వైపు ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్​ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రచారపర్వంలోకి దూకారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచే జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పాలేరు నుంచే బరిలోకి దిగాలని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్​ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అభ్యర్థిత్వం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు.

Telangana Assembly Elections 2023
Political Heat in Paleru Constituency

Paleru Assembly Constituency Elections 2023 : రాష్ట్రంలో ప్రధాన పార్టీల రాజకీయ ప్రముఖులు బరిలో నిలుస్తుండటంతో.. ఖమ్మం జిల్లా పాలేరులో(Paleru Constituency) శాసనసభ ఎన్నికల పోరు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అధికార బీఆర్​ఎస్​, వైఎస్ఆర్​టీపీ, కాంగ్రెస్ నుంచి కీలక నేతలు పాలేరు ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అంటుండటంతో రాజకీయంగా కాకపుట్టిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో పాలేరు ఒకటిగా ఉంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మరోసారి బరిలో నిలుస్తున్నారు.

YSRTP Ready to Contest in 119 Constituencies : పాలేరు నుంచి బరిలో వైఎస్‌ షర్మిల.. అన్ని స్థానాల్లో వైఎస్​ఆర్​టీపీ పోటీకి నిర్ణయం

Telangana Assembly Elections 2023 : క్షేత్రస్థాయిలో ప్రచారపర్వంలో మరింత దూకుడు పెంచేందుకు బీఆర్​ఎస్​(BRS) కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఎన్నికల బహిరంగ సభకు పాలేరునే ఎంపిక చేశారు. ఈ నెల 27న నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ బహిరంగ సభను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ జన సమీకరణకు సమాయత్తమవుతోంది

పాలేరు బరిలో నిలస్తున్నట్లు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించడంతో.. నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం తర్వాత పాలేరు నుంచే పోటీ చేస్తానని షర్మిల చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో కార్యాచరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన సమయంలో పాలేరులోని అన్ని మండలాల్లో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో వైఎస్​ఆర్​టీపీ- కాంగ్రెస్​తో పొత్తు ఉంటుందని భావించినా సాధ్యపడకపోవడంతో ఇటీవల పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు.

Khammam Political News : కాంగ్రెస్​లో (Congress in Paleru)​ పాలేరు టికెట్ పోరు తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (thummala nageswara rao), కాంగ్రెస్ ప్రచారకమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాలేరు అభ్యర్థిత్వం కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఇద్దరూ పాలేరు టికెట్ పైనే గురి పెట్టడంతో అభ్యర్థి ఎంపికపై.. హస్తం పార్టీ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలుత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీ ఆయనకు ప్రాధాన్యమిస్తోంది. కీలకమైన ప్రచార కమిటీ కో-ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది.

Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'

Political War in Paleru Constituency : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) పాలేరు నుంచి పోటీకే ఆసక్తి చూపుతున్నారు. బీఆర్​ఎస్​లో పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల.. పాలేరు నుంచి టికెట్ ఆశించి కాంగ్రెస్​లో చేరారు. పాలేరుకు గోదావరి జలాలు తీసుకు రావాలన్న లక్ష్యంతోనే ఇక్కడి నుంచే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. దీంతో.. ఇద్దరు ముఖ్యనేతల్లో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది హస్తం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వీరిద్దరికి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నేతల మధ్యే.. విబేధాలు తలెత్తే పరిస్థితి నెలకొన్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. రెండు మూడు రోజుల్లో ఇద్దరిలో ఎవరు పాలేరు నుంచే బరిలోకి దిగుతారన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే.. తుమ్మల, పొంగులేటిలో ఒకరు పాలేరు బరిలో నిలిస్తే.. మిగిలిన నాయకుడు ఖమ్మం నుంచి పోటీలో నిలుస్తారన్న ప్రచారం సాగుతోంది.

మొత్తంగా ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా పాలేరుపైనే గురి పెట్టడంతో.. నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత పోటాపోటీ ప్రచారాలు, నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు-ప్రతి సవాళ్లతో పాలేరు దంగల్ రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

జెండా ఏదైనా తన ఎజెండా మాత్రం బీఆర్​ఎస్​ను గద్దె దించడమే: పొంగులేటి

Political Heat in Dubbaka Assembly Constituency : దుబ్బాకలో ఈసారి గెలుపెవరిది.. త్రిముఖ పోరు తప్పేలా లేదుగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.