ETV Bharat / state

ఓచర్ చూపించి... బ్యాంకులో రూ.30 లక్షలు దోచుకెళ్లాడు! - latest crime news in khammam district

బ్యాంక్​ ఏటీఎంలో డబ్బులు లేవని.. అందుకై ప్రధాన బ్రాంచి వారు మీ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురమ్మాన్నారంటూ వచ్చాడు. వోచరూ చూపించాడు. నమ్మిన మేనేజర్.. వచ్చిన వాడికి డబ్బులిచ్చి పంపించాడు. సాయంత్రం ప్రధాన బ్రాంచ్​ని సంప్రదిస్తే.. తాము ఎవరినీ పంపలేదని.. తమకు డబ్బూ అందలేదని చెప్పారు. డబ్బులు తీసుకెళ్లిన వ్యక్తికి ఫోన్​ చేస్తే... స్విచ్చాఫ్! బ్యాంక్ మేనేజర్​ పై అధికారులకు సమాచారం అందించాడు. పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Parar with bank money.. Complaint to police
బ్యాంకు డబ్బులతో పరార్​.. పోలీసులకు ఫిర్యాదు
author img

By

Published : Feb 14, 2020, 11:31 AM IST

ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న వెంకన్న అనే ఉద్యోగి.. బ్యాంకులో జమ చేయాల్సిన రూ. 30 లక్షల నగదుతో ఉడాయించాడు. అనంతరం ఫోను స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ మేరకు బ్యాంక్​ మేనేజర్ పోలీసులకు​ ఫిర్యాదు చేశాడు.

ఖమ్మంలోని సీఐఎస్​సీవో అనే ఓ ప్రైవేటు ఏజెన్సీలో వెంకన్న పదేళ్లుగా పని చేస్తున్నాడు. ఏజెన్సీ ఉద్యోగులు బ్యాంకుల్లో నగదు తీసుకుని ఏటీఎంలలో పెట్టడం.. ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు నగదును తరలించడం అతని పని.

ఈనెల 11న నిందితుడు వెంకన్న.. గాంధీ చౌక్​లోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు వెళ్లి.. వైరా రోడ్డులోని ప్రధాన బ్రాంచ్​వారు రూ. 30 లక్షలు తీసుకురమ్మన్నారని వోచర్ చూపించాడు. ఫలితంగా వాళ్లు వెంకన్నకు రూ. 30 లక్షలు అందజేశారు.

సాయంత్రం బ్యాంకు మూసివేసే సమయంలో లెక్కలు చూస్తుండగా.. ప్రధాన బ్రాంచ్​కి డబ్బులు చేరలేదని అధికారులు గుర్తించారు. ఇదే విషయమై నిందితుడికి ఫోన్ చేస్తే.. స్విచ్ఛాఫ్​ వచ్చింది. వెంటనే విషయాన్ని పైఅధికారులకు తెలిపారు. ఇవాళ బ్యాంకు మేనేజర్ వెంకట కృష్ణారావు​ మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బ్యాంకు డబ్బులతో పరార్​.. పోలీసులకు ఫిర్యాదు

ఇదీ చూడండి : మంత్రి గారి చేతి కడియం కొట్టాశారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.