ఖమ్మం జిల్లాలో కొత్తగా 485 మంది పంచాయతీ కార్యదర్శులు నియమించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. కొత్తగా ఎంపికైన కార్యదర్శులకు ఏనుకూరు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండటం, మౌలిక వసతులు కల్పించడం, ఆదాయ వనరులు పెంచడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా హరితహారం, గ్రామాల్లో వైకుంఠ దామం పథకం పటిష్టంగా అమలయ్యేలా కృషి చేయాలన్నారు. పల్లెల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఇవీ చూడండి: రఫేల్ పత్రాలు లీకైనా సమస్య లేదు