ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆ బహుమతి ఇద్దాం: పల్లా రాజేశ్వర్ రెడ్డి - తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు

ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహుమతిగా ఇద్దామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో తెరాస ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

mlc election campaign in khammam district
పల్లా రాజేశ్వర్ రెడ్డి
author img

By

Published : Oct 11, 2020, 10:53 AM IST

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్​రాజు అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహుమతిగా ఇద్దామని పల్లా రాజేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మధు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.