ETV Bharat / state

Paleru reservoir: పొంగిపొర్లుతున్న వాగులు.. వరదలో చిక్కుకుపోయిన ట్రాక్టర్ - ఖమ్మం జిల్లా

Paleru reservoir: భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్​కు పెద్దఎత్తున వరద నీరు చేరింది. అధికారులు జలాశయం 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఖమ్మం-సూర్యాపేట రహదారిపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Paleru reservoir
Paleru reservoir
author img

By

Published : Jul 23, 2022, 4:27 PM IST

Updated : Jul 23, 2022, 7:06 PM IST

Paleru reservoir: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్లు నిండుకండల్లా మారాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్​ 23 అడుగులకు చేరడంతో అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో ఖమ్మం సూర్యాపేట రహదారిపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు భారీగా విడుదల చేయటంతో పంట పొలాలు కూడా నీటిలో మునిగిపోయాయి. పాలేరు రిజర్వాయర్ పాత కాలువ, ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

పొంగిపొర్లుతున్న పాలేరు చెరువు: ఖమ్మం జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రేగళ్లనుంచి మార్కోడు వెళ్లే మార్గమధ్యలో ప్రవహిస్తున్న పాలవాగులో అటవీ శాఖ మొక్కల కోసం వినియోగించిన ట్రాక్టర్ కొట్టుకుపోగా దానిని నిలువరించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. అటవీ స్థలాల్లో మొక్కలను డంపు చేసి వస్తుండగా వాగులో వరద తాకిడి పెరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

పొంగిపొర్లుతున్న వాగులు.. వరదలో చిక్కుకుపోయిన ట్రాక్టర్

నీటి ప్రవాహంలో కొంత దూరం వెళ్లి ట్రాక్టర్ వాగుఒడ్డున చెట్లలో చిక్కుకుంది. ట్రాక్టర్ రాఘవాపురం గ్రామానికి చెందిందని స్థానికులు తెలిపారు. మరోవైపు ఆళ్లపల్లి-మార్కోడు మధ్యగల రహదారిలో రాఘవాపురం వద్ద ఎర్ర చెరువు అలుగు పారి ప్రధాన రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వాగులు పొంగిపొర్లుతున్న అత్యవసరంగా వెళ్లే వారు పలుచోట్ల దాటేందుకు యత్నిస్తున్నారు.

ఇవీ చదవండి: రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం

రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ

ఆ టీవీ డిబేట్​లపై సీజేఐ ఆందోళన.. 'ప్రజాస్వామ్యం రెండడుగులు వెనక్కి

Last Updated : Jul 23, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.