ETV Bharat / state

Grain Storage Problems: యాసంగి ధాన్యం నిల్వలకు చోటేది..?

Grain Storage Problems in khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణ అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది. రెండు జిల్లాల్లోనూ ఈసారి లక్ష్యం భారీగానే ఉండగా.. అసలు గత రెండు సీజన్లలో వచ్చిన ధాన్యంతోనే మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో యాసంగిలో ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని గిడ్డంగుల్లోనైనా నిల్వ చేద్దామంటే.. అక్కడా ఖాళీల్లేక ఏం చేయాలో పాలుపోక రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్ల తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది.

No Place For Grain Storage
No Place For Grain Storage
author img

By

Published : Apr 23, 2023, 12:46 PM IST

Updated : Apr 23, 2023, 2:02 PM IST

Grain Storage Problems

Grain Storage Problems in khammam: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో యాసంగి ధాన్యం సేకరణ అధికార యంత్రాంగానికి అగ్నిపరీక్షగా మారుతోంది. రెండు జిల్లాల్లోనూ ఇప్పటికే వరి కోతలు మొదలై.. ధాన్యం రైతుల చేతికొస్తుండగా మరికొన్ని రోజుల్లో ముమ్మరంగా ధాన్యం కేంద్రాలకు తరలిరానుంది. ఈ పరిస్థితుల్లో వరి కోసిన వెంటనే ధాన్యాన్ని కేంద్రాలకు తరలించేందుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ముందుగా ధాన్యం చేతికొచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభించి, ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

230 కేంద్రాల ద్వారా ఈసారి ధాన్యం సేకరిస్తాం: ఖమ్మం జిల్లాలో ఈ సారి ధాన్యం సేకరణ 4,34,018 మెట్రిక్ టన్నులు ఉండగా.. భద్రాద్రి జిల్లాలో 1,56,040 మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టుకున్నారు. భద్రాద్రి జిల్లాలో 134 కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో 230 కేంద్రాల ద్వారా ఈసారి ధాన్యం సేకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్​లో ధాన్యం సేకరణ అధికార యంత్రాంగానికి, ఇటు మిల్లర్లకు సవాలుగా మారుతోంది. గత రెండు సీజన్లలో వచ్చిన ధాన్యం నిల్వలు మిల్లర్ల వద్దే పేరుకుపోయాయి. మిల్లర్లు ధాన్యాన్ని మరబట్టి బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి రవాణా చేస్తుండగా గిడ్డంగుల్లో సామర్థ్యం లేక దిగుమతి చేసుకునేందుకు ఎఫ్​సీఐ ససేమిరా అంటోంది. దీంతో ఈసారి అసలు ధాన్యమే తీసుకోలేమని మిల్లర్లు ఇప్పటికే ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.

కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలి?: ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడికి తరలించాలని అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఖమ్మం జిల్లాలో పౌర సరఫరాల శాఖ పరిధిలో ఉన్న 12 గిడ్డంగులు ఉన్నాయి. వీటిలో 78,389 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నా.. అందులో బియ్యం, గోనె సంచులతో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడా గోదాముల్లో ఎక్కడ ఖాళీల్లేవు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రెండు జిల్లాల అధికారులు ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నారు.

రైతు వేదికలు, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీగా ఉన్న భవనాల్లో ధాన్యం నిల్వ చేయాలని భావిస్తున్నారు. ఈసారి ఎదురయ్యే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాసులు అకాల వర్షానికి తడవకుండా రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు లేకపోవడంతో రైతులకు గుబులు పుడుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 23, 2023, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.