నూతన జాతీయ రహదారుల డిక్లరేషన్‌ను త్వరగా పూర్తిచేయాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, అజయ్‌కుమార్ లు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రవాణా శాఖ.. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం తరఫున హైదరాబాద్ నుంచి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనుల గురించి కేంద్రమంత్రికి వివరించారు. లాక్డౌన్ వల్ల కొన్ని చోట్ల పనులు నిలిచిపోయినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు నూతన రోడ్లు, పెండింగ్ పనుల పురోగతిపై నితిన్ గడ్కరీతో మాట్లాడిన విషయాలను.. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.
రీజనల్ రింగ్ రోడ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎన్హెచ్ఏ అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఆ విషయం గురించి కేటీఆర్‌తో మాట్లాడా: కిషన్‌రెడ్డి