కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై పరిశీలనలో భాగంగా.. జాతీయ స్థాయి పరిశీలనా బృందం సభ్యులు ఖమ్మం జిల్లాలో తనిఖీలు చేశారు. సత్తుపల్లి మండలం గంగారం, ఏన్కూరు మండలం శ్రీరామగిరి, ఖమ్మం గ్రామీణ మండలంలో పర్యటించారు. ఉపాధి హామీ పథకం క్షేత్ర స్థాయి అమలు, ఐసీడీఎస్, సెర్ఫ్, వైద్యం, పంచాయతీల నిర్వహణను పరిశీలించారు. ఏన్కూరు మండలంలో గురువారం నాడు రేపల్లెవాడ, జన్నారంలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం బృందం సభ్యులు బిబిన్తంభీ, శానిస్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్'