ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. నామపత్రాల స్వీకరణకు చివరిరోజు అయినందున అభ్యర్థులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, తల్లాడ ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: జనారణ్యంలోకి దుప్పి... గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి