ఇవీ చూడండి:రాజకీయాల్లో గుణాత్మకమార్పు తెస్తా... ఆశీర్వదించండి!
అభివృద్ధి కోసమే తెరాసలోకి వచ్చాను: నామ - sattupali
శాసనసభ ఎన్నికల్లో తెరాసకు ఖమ్మంలో ఆశించినంత ఫలితాలు రాలేదని... ఈసారి ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని గెలిచి కేసీఆర్కు కానుక ఇవ్వాలని నామ నాగేశ్వరరావు సూచించారు. ఎన్నికల్లో భాగంగా సత్తుపల్లిలో పర్యటించి గెలిపించాలని అభ్యర్థించారు.
నామ ప్రచారం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేంసూర్లో తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ ఒకపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమాన్ని విజయవంతంగా చేయడం చూసి... తాను తెరాసలోకి వచ్చానని పేర్కొన్నారు. తనను గెలిపించి కేసీఆర్కు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని జిల్లా ప్రజలు బహుమతిగా ఇవ్వాలన్నారు. సత్తుపల్లి ప్రజల సమస్యల పరిష్కారం కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి, పేద ప్రజలకు, రైతులకు తెరాస పాలన అవసరమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఇవీ చూడండి:రాజకీయాల్లో గుణాత్మకమార్పు తెస్తా... ఆశీర్వదించండి!
Last Updated : Mar 30, 2019, 8:06 AM IST