పార్లమెంట్లో జరిగిన బడ్జెట్ చర్చలో తెరాస లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వర రావు పాల్గొన్నారు. తెలంగాణకు నిధులు కేటాయింపు పెంచాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఆరు నూతన విమానాశ్రయాలు ఏర్పాటు చేయటంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హెూదా కల్పించాలన్నారు. కేంద్ర నిధులతో వరంగల్‌లో గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటంతో పాటు నీతి అయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు.
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలి. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ అభివృద్ధికి నిధులివ్వాలి. రాష్ట్రంలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలి. హైదరాబాద్-నాగపూర్, వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలి. రీజనల్ రింగ్ రోడ్ మంజూరు చేయాలి. రూ. 993.65 కోట్ల అంచనాతో సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి.
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రితో కలిసి వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ఉప రాష్ట్రపతి కూడా హైదరాబాద్‌లో లేబరేటరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయమై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. ఆత్మ నిర్భర్‌లో భాగంగా మౌళిక సదుపాయాల కల్పనకు వచ్చే ఐదేళ్లలో రూ . 1.97 లక్షల కోట్లను దాదాపు 13 రంగాల్లో ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. తెలంగాణలో కూడా మౌళిక సదుపాయల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలి.
..లోక్‌సభలో నామ నాగేశ్వర రావు
ఇదీ చదవండి: బీబీనగర్ ఎయిమ్స్ కోసం వెచ్చించింది రూ.22.78కోట్లు మాత్రమే