సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ముందస్తుగా జరుగుతున్న పార్లమెంట్ కమిటీ భేటీల్లో ఖమ్మం ఎంపీ, తెలంగాణ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వర రావు పాల్గొన్నారు.
అక్టోబర్ 1 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌కు సంబంధించి గ్రంథాలయ కమిటీ, కామర్స్, బిజినెస్ అడ్వజరీ, స్టాండింగ్, జలశక్తి కమిటీల్లో నామ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి.
ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ