వక్ఫ్ భూములను పేద ముస్లింలకు పంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ముస్లింలు ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మోమిన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు. గొల్లగూడెంలో ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈద్గా, ఖబరిస్తాన్, విద్యాసంస్థలకు భూమి కేటాయించగా.. మిగిలిన భూమిని ఇళ్లు లేని పేద ముస్లింలకు పంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'పరీక్షలే సక్రమంగా నిర్వహించలేదు.. ప్రధాని అవుతారా?'