హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఖమ్మంలోని జడ్పీ కూడలిలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. చేతికి తాళ్లు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: నయీం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం