ETV Bharat / state

చేకూరి కాశయ్య మృతిపట్ల ఎంపీ నామ సంతాపం - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతి పట్ల తెరాస లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. గురుదక్షిణ పౌండేషన్‌లో ఉంచిన కాశయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఇటీవల కరోనాతో మృతి చెందిన బేగ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

MP Nama Nageswara Rao mourns the death of chekuri Kashayya
కాశయ్య మృతి పట్ల ఎంపీ నామా నాగేశ్వరరావు సంతాపం
author img

By

Published : May 25, 2021, 8:16 PM IST

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ రాజకీయ, విద్యావేత్త చేకూరి కాశయ్య మృతిపట్ల... తెరాస లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. గురుదక్షిణ పౌండేషన్‌లో ఉంచిన కాశయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబసభ్యులకు పరామర్శించారు.

ఇటీవల కరోనాతో పోరాడుతూ... తుదిశ్వాస విడిచిన బుడాన్ బేగ్ ఇంటికెళ్లి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బేగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆయనతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీకి బేగ్ ఉన్నత సేవలు అందించారని అన్నారు. ఏంపీతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు.

ఇదీ చదవండి: 90 ఏళ్ల వృద్ధురాలిని భుజాలపై మోసుకెళ్లిన పోలీసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.