ETV Bharat / state

కేటీఆర్​కు రూ. 1.23 కోట్ల చెక్కు అందజేసిన ఎంపీ నామ

తెరాస లోక్​ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు మానవత్వం చాటారు. కరోనా బాధితులకు సహాయంగా 6 అంబులెన్స్​లకు రూ. 1.23 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్​కు అందజేశారు. వీటిని వైద్య ఆరోగ్య శాఖకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో త్వరలో ఈ అంబులెన్స్​ల సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

కేటీఆర్​కు రూ. 1.23 కోట్ల చెక్కు అందజేసిన ఎంపీ నామ
కేటీఆర్​కు రూ. 1.23 కోట్ల చెక్కు అందజేసిన ఎంపీ నామ
author img

By

Published : Sep 5, 2020, 4:27 PM IST

కరోనా బాధితులకు సహాయంగా 6 అంబులెన్స్​లకు రూ. 1.23 కోట్ల చెక్కును తెరాస లోక్​ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు మంత్రి కేటీఆర్​కు అందజేశారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగ్గా వైద్యం చేరువయ్యేందుకు తనవంతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఆరు అంబులెన్స్​లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వీటిని వైద్య ఆరోగ్య శాఖకు అందజేస్తున్నట్లు నామ పేర్కొన్నారు.

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలైనా.. 1. ఖమ్మం-పాలేరు, 2. వైరా, 3. మధిర, 4. సత్తుపల్లి, 5. అశ్వారావుపేట, 6. కొత్తగూడెంలలోని కరోనా బాధితులకు ఈ ప్రత్యేక అంబులెన్స్​ల సేవలు త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సమయం వృథా కాకుండా బాధితులను నిర్ణిత సమయంలో (గోల్డెన్ అవర్) ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ఆరు అంబులెన్స్​ల కోసం చెక్​ ఇచ్చిన ఎంపీ నామను మంత్రి కేటీఆర్​ అభినందించారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.